
రాజకీయాలు

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చేరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌పై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వర్షాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా కొనసాగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!