
బిజినెస్

ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారుల మంగళవారం ఉదయం విడుదల చేసిన వివరాల ప్రకారం జలాశయం నీటిమట్టం 858.70 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 101.9210 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 1,53,543 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 924 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు.
కర్ణాటకలోని ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల మరింత పెరుగుతున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కూడా అధికమయ్యే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దిగువ ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!