

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఉదయం 9 గంటలకు శ్రీ భ్రమరాంబదేవి ఆలయంలో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. రాత్రి 7 గంటల నుంచి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నేడు రాత్రి 7:30 గంటలకు శ్రీ స్వామివారు, అమ్మవారు బృంగి వాహనంపై గ్రామోత్సవంలో పాల్గొననున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో ఉత్సవాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలతో పాటు ఆర్జిత హోమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. ఈ సమయంలో శ్రీశైలానికి వచ్చే భక్తులు ఉత్సవాల షెడ్యూల్‌ను, పూజా కార్యక్రమాల్లో చేసిన మార్పులను గమనించి తమ దర్శన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!