
బిజినెస్

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో మొత్తం 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి హుండీ ద్వారా రూ.28.94 కోట్ల ఆదాయం లభించింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు విస్తృతంగా అన్నప్రసాదాలను అందించారు. మొత్తం 21.84 లక్షల అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 33 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!