
సినిమాలు

బ్యాంకాక్ ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్‌లో చిక్కుకున్న నిరుద్యోగ యువకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
యువత సైబర్ నేరగాళ్ల మోసాలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!