
బిజినెస్

గానంతో సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైకోం విజయలక్ష్మి.. ‘ఏఆర్‌ఎం’ చిత్రంలోని ‘అంగు వాన కోనిలు’ పాటకు ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా 72వ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెకు పురస్కారం అందజేశారు. ఇది విజయలక్ష్మికి తొలి జాతీయ అవార్డు.
చూపు సమస్యతో పుట్టినప్పటికీ చిన్న వయసు నుంచే సంగీతాన్ని జీవితంగా మలుచుకున్న విజయలక్ష్మి.. మలయాళంతో పాటు పలు భాషల్లో పాటలు పాడారు. 2019లో చూపు చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన ఆమెకు వైద్యపరమైన కారణాలతో చికిత్స కొనసాగలేదు. వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె.. తన నిర్ణయాలను తానే తీసుకున్నానని గతంలో వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!