
బిజినెస్

ఏషియన్ గేమ్స్-2026లో భారత పురుష, మహిళల కబడ్డీ జట్లు సత్తాచాటుతున్నాయి. మహిళల జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. తాజాగా పురుషుల జట్టు కూడా తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం ఐచిలో జరిగిన సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై భారత్ 66-28తో ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
అంతకుముందు భారత మహిళల కబడ్డీ జట్టు సెమీఫైనల్లో నేపాల్‌ను 48-24తో ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు కబడ్డీ నుంచి రెండు పతకాలు ఖాయమయ్యాయి. శనివారం జరిగే ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు ఇరాన్ లేదా చైనీస్ తైపీతో తలపడనుంది. రెండు భారత జట్లు ఇప్పటివరకు టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!