

మరణశిక్షను ఉరి ద్వారా అమలు చేయడానికి బదులుగా తక్కువ నొప్పి కలిగించే ప్రాణాంతక ఇంజెక్షన్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. ప్రస్తుతం అమలులో ఉన్న మరణశిక్ష విధానాన్ని నిపుణుల సహాయంతో సమగ్రంగా సమీక్షించుకోవచ్చని స్పష్టం చేసింది. మరణశిక్ష అమలులో ఖైదీ గౌరవాన్ని కాపాడటంతో పాటు సాధ్యమైనంత తక్కువ బాధ కలిగించే విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
1983లో మూడు సభ్యుల ధర్మాసనం సీఆర్‌పీసీ సెక్షన్ 354(5) కింద ఉరి ద్వారా మరణశిక్ష అమలు చేయడం రాజ్యాంగబద్ధమేనని ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరాన్ని పిటిషనర్ నిరూపించలేకపోయారని తాజా తీర్పులో కోర్టు తెలిపింది. అయితే భవిష్యత్తులో శాస్త్రీయ, వైద్య ఆధారాల్లో మార్పులు వస్తే ఈ అంశంపై రాజ్యాంగపరమైన సమీక్షకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. 2017లో సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రాణాంతక ఇంజెక్షన్, కాల్చడం, విద్యుదాఘాతం, గ్యాస్ ఛాంబర్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!