
సినిమాలు

చైనాను నిలువరించిన జోరును కొనసాగిస్తూ భారత మహిళల హాకీ జట్టు వరల్డ్‌కప్‌లో మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-డి రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 6-1 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. టొప్పో 11వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు శుభారంభం అందించగా, నవ్‌నీత్ కౌర్ 17వ నిమిషంలో, సుశీలా చాను 25వ నిమిషంలో గోల్స్ చేశారు. దీపిక 38వ నిమిషంలో, లాల్‌రిమ్సియామి 44వ నిమిషంలో, సాక్షి రాణా 45వ నిమిషంలో గోల్స్ సాధించారు.
దక్షిణాఫ్రికా తరఫున కైలా డి వాల్ 55వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది. ఈ విజయంతో భారత్ 4 పాయింట్లతో గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలిచి, రెండో రౌండ్‌కు చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. భారత్ తదుపరి గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!