
సినిమాలు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ పిటిషన్‌ను తిరస్కరించింది.
రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నానికి ఈ తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల అమలులో న్యాయస్థానాలు నిర్దేశించిన పరిమితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!