
జనరల్

మత మార్పిడి విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల నుంచి ఇతర మతాలకు మారితే షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ) హోదా కోల్పోతారని స్పష్టం చేసింది. మార్చి 2026లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం, ఆ నిర్ణయాన్ని మరొకసారి ధృవీకరించింది.
క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. అయితే తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాల్లోకి మారితే మాత్రమే ఆ హోదా పునరుద్ధరించబడుతుందని పేర్కొంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!