
జనరల్

సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆన్‌లైన్ సేవలు లేదా కోర్టుకు సంబంధించిన సమాచారాన్ని పొందే ముందు వెబ్‌సైట్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది.
sci.gov.in మాత్రమే సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ అని కోర్టు స్పష్టం చేసింది. నకిలీ వెబ్‌సైట్లు ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవచ్చని, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నాలు చేయవచ్చని హెచ్చరించింది. కేసు వివరాలు, తీర్పులు, నోటీసులు, ఇతర అధికారిక సేవలను పొందేందుకు అధికారిక వెబ్‌సైట్‌నే వినియోగించాలని సూచించింది. సైబర్ మోసాలు, నకిలీ ప్రభుత్వ పోర్టళ్లపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ హెచ్చరిక జారీ చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!