15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

Writer: Nithish 02:40 PM, 15 అక్టోబర్, 2026
డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

విజయవాడలో నిర్వహించిన జాతీయ సరస్ మేళా-2026లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలో ఈ మేళాను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నారీశక్తికి, నవభారత శక్తికి ప్రతిరూపంగా అభివర్ణించారు. ఢిల్లీ వెలుపల తొలిసారిగా విజయవాడలో మహిళల జాతీయ సరస్ మేళాను నిర్వహించడం మహిళా శక్తిని చాటుతుందని తెలిపారు. గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, గ్రామీణ ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 11 లక్షల స్వయం సహాయక సంఘాలు రూ.69 వేల కోట్ల టర్నోవర్‌తో ముందంజలో ఉన్నాయని, ఏడాది కాలంలో లక్ష మంది సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని వెల్లడించారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.

డ్వాక్రా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ను తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ ఉత్పత్తులను ఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్ వేదికల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పొదుపు సంఘాలు పొదుపు చేసే స్థాయి నుంచి ఆదాయం ఆర్జించే వ్యాపార సంస్థలుగా ఎదగాలని, భవిష్యత్తులో అంతర్జాతీయ బ్రాండ్లుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలు 100 కోట్ల ప్రయాణాలు పూర్తి చేశారని తెలిపారు. ప్రతి మహిళకు ‘వెల్ఫేర్ టు వెల్త్’ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, స్వయం సహాయక సంఘాల సహకారంతో స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి సంఘం ఆర్థిక శక్తిగా, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా, ప్రతి గ్రామం ఉపాధి కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు  ఇళ్లు...

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్లు...

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా

అమరావతిలో జాతీయ సరస్ మేళా-2026.. మహిళా శక్తిపై రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

అమరావతిలో జాతీయ సరస్ మేళా-2026.. మహిళా శక్తిపై రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ట్యాగ్లు
జాతీయ సరస్ మేళా 2026చంద్రబాబు నాయుడుస్వయం ఏపీ బ్రాండ్డ్వాక్రా మహిళలుమహిళా సాధికారతస్వయం సహాయక సంఘాలువిజయవాడ వార్తలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంస్త్రీశక్తి పథకంస్వర్ణాంధ్ర 2047
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు  ఇళ్లు...
జనరల్

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్లు...

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం
జనరల్

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..
రాజకీయాలు

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!
సినిమాలు

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!

ఇంటర్నెట్‌లో స్వయంగా విస్తరించే సామర్థ్యం AIకి రావొచ్చు.. ఆంథ్రోపిక్‌ హెచ్చరిక
టెక్నాలజీ

ఇంటర్నెట్‌లో స్వయంగా విస్తరించే సామర్థ్యం AIకి రావొచ్చు.. ఆంథ్రోపిక్‌ హెచ్చరిక

అధునాతన రీజనింగ్, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలతో గూగుల్‌ కొత్త AI మోడల్‌ ‘జెమినీ 4 ఆర్గాన్‌’
టెక్నాలజీ

అధునాతన రీజనింగ్, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలతో గూగుల్‌ కొత్త AI మోడల్‌ ‘జెమినీ 4 ఆర్గాన్‌’

ఫోన్‌లోనే కాలర్ పేరు.. ట్రూకాలర్ అవసరం లేకుండా కొత్త సదుపాయం!
బిజినెస్

ఫోన్‌లోనే కాలర్ పేరు.. ట్రూకాలర్ అవసరం లేకుండా కొత్త సదుపాయం!

అక్టోబర్ 21న జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం..
బిజినెస్

అక్టోబర్ 21న జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం..

ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లు పెంపు..
బిజినెస్

ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లు పెంపు..

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా
జనరల్

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా

అమరావతిలో జాతీయ సరస్ మేళా-2026.. మహిళా శక్తిపై రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు
జనరల్

అమరావతిలో జాతీయ సరస్ మేళా-2026.. మహిళా శక్తిపై రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
రాజకీయాలు

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
రాజకీయాలు

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

పక్కోళ్ల జీవితాల్లోకి తొంగి చూడటమే బిగ్‌బాస్.. నాగార్జున పాత వీడియో వైరల్!
షోస్

పక్కోళ్ల జీవితాల్లోకి తొంగి చూడటమే బిగ్‌బాస్.. నాగార్జున పాత వీడియో వైరల్!

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!