

2026 అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి గౌరవ వేతనం అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం రూ.198 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన వేలాది మంది సిబ్బందికి ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. ఎన్నికల సమయంలో వారు నిర్వహించిన బాధ్యతలు, హోదాలను బట్టి గౌరవ వేతనాన్ని చెల్లించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లకు ఒక నెల ప్రాథమిక వేతనానికి సమానమైన మొత్తాన్ని అందజేయనున్నారు. అయితే ఈ చెల్లింపు గరిష్ఠంగా రూ.45,000 వరకు ఉండనుంది.
ఫ్లయింగ్ స్క్వాడ్స్, వీడియో నిఘా బృందాల్లో పనిచేసిన సిబ్బందికి గరిష్ఠంగా రూ.30,000 వరకు చెల్లించనున్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి వేర్వేరు స్లాబ్‌ల ఆధారంగా గౌరవ వేతనం అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారుల సేవలను గుర్తించి ఈ మొత్తాన్ని కేటాయించినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!