7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

Writer: Pooja 02:16 PM, 7 నవంబర్, 2026
ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

ఈ ఏడాది ధనత్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం, వెండి కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఇటీవల బంగారం ధరలు కొంత తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. ఈ ఏడాది ధనత్రయోదశి రోజున దేశంలో బంగారు వ్యాపారం విలువ పరంగా 15 నుంచి 20 శాతం పెరిగి సుమారు రూ.60 వేల కోట్లకు చేరుకోవచ్చని అఖిల భారత జెమ్స్ అండ్ జ్యువెలర్స్ దేశీయ కౌన్సిల్ (GJC) అంచనా వేసింది. జనవరి 29న నమోదైన గరిష్ఠ ధరలతో పోలిస్తే ప్రస్తుతం పసిడి ధరలు కొంత తగ్గాయి. ఢిల్లీ సహా పలు మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,46,300గా ఉంది. అయినప్పటికీ గత ఏడాది ధనత్రయోదశితో పోలిస్తే ధరలు ఎక్కువగానే ఉన్నాయి. వెండి ధరలు కూడా జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే దాదాపు 52 శాతం తగ్గి సుమారు రూ.1,92,500 వద్ద ఉన్నట్లు సమాచారం. ధరల్లో వచ్చిన తగ్గుదలతో వినియోగదారులు బంగారం, వెండి కొనుగోళ్లకు ముందుకొచ్చారు.

ధరలు అధికంగా ఉండటంతో వినియోగదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా కొనుగోళ్లు చేశారు. భారీ ఆభరణాల కంటే తేలికపాటి నగలు, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపించారు. చిన్న సైజు బంగారు నాణేలు, బార్లు, పెండెంట్లు, గాజులు, గొలుసులకు డిమాండ్ పెరిగింది. జైపూర్, సూరత్, డెహ్రాడూన్, రాయ్‌పూర్ వంటి చిన్న నగరాల్లోనూ తొలిసారి బంగారం కొనుగోలు చేస్తున్న వారి నుంచి మంచి స్పందన లభించిందని వ్యాపారులు వెల్లడించారు. పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే విధానం కూడా అమ్మకాల వృద్ధికి దోహదపడింది. డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లలోనూ కొనుగోళ్లు జరిగాయి. కల్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, పీఎన్జీ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్ వంటి ప్రముఖ సంస్థలు తమ అమ్మకాలు 25 నుంచి 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పలువురు ముందుగానే షాపింగ్ పూర్తి చేసుకున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనాల ప్రకారం, గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జరిగిన బంగారం, వెండి అమ్మకాల విలువ రూ.66 వేల కోట్లను దాటింది. ఒక్క ఢిల్లీ బులియన్ మార్కెట్‌లోనే రూ.10 వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు అంచనా. పండుగ సందర్భంగా పెరిగిన కొనుగోళ్లు దేశీయ ఆభరణాలు, బులియన్ వ్యాపార రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

ట్యాగ్లు
ధనత్రయోదశిబంగారం ధరలువెండి ధరలుబంగారం కొనుగోళ్లుఆభరణాల మార్కెట్బులియన్ వ్యాపారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్నికల సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా
జనరల్

ఎన్నికల సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు
బిజినెస్

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
గాసిప్స్

‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్

ధరణి భూ రికార్డుల అక్రమాలపై సీఐడీ దూకుడు
జనరల్

ధరణి భూ రికార్డుల అక్రమాలపై సీఐడీ దూకుడు

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం
సినిమాలు

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’
సినిమాలు

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’

13 ఏళ్ల టెస్ట్ ప్రయాణానికి వీడ్కోలు పలికిన మహమ్మద్ షమీ
క్రీడలు

13 ఏళ్ల టెస్ట్ ప్రయాణానికి వీడ్కోలు పలికిన మహమ్మద్ షమీ

హైదరాబాద్ మూసీ ప్రాజెక్టుపై గ్లోబల్ పోటీ
జనరల్

హైదరాబాద్ మూసీ ప్రాజెక్టుపై గ్లోబల్ పోటీ

భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన న్యూజిలాండ్
క్రీడలు

భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన న్యూజిలాండ్

ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్..డేంజర్‌లో నలుగురు
షోస్

ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్..డేంజర్‌లో నలుగురు

ముకేష్ కోసం తన అవకాశాన్ని త్యాగం చేసిన వర్షిణి
షోస్

ముకేష్ కోసం తన అవకాశాన్ని త్యాగం చేసిన వర్షిణి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!