
జనరల్

మూడేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన ఘటనకు నిరసనగా సౌదీ అరేబియాలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపు మేరకు బుధవారం రాత్రి రియాధ్ నగరంలో టీడీపీ నేతలు జానీ బాషా, రాజశేఖర్ ఆధ్వర్యంలో 53 కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చెన్నుపాటి నరేశ్, గుత్తా వెంకటరావు, సత్యశ్రీనివాస్, ముజ్జమ్మీల్ షేక్, పోకూరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!