

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేరు సూచించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తన సొంతూరు వరంగల్‌కు విమానాశ్రయం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’, ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ పేర్లను సూచించారు. వరంగల్ ఘనమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేరు ఉండటం అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. వరంగల్ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ‘సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ పేరును సూచించారు. సినీ నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా మామునూరు విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొంది. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ‘రాణి రుద్రమ దేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, వరంగల్’ పేరును సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!