

గోవా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల మధ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మాదకద్రవ్యాల ముఠాను తెలంగాణ ఈగల్ అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా కొకైన్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, హష్ ఆయిల్ వంటి మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడకు చెందిన కొమ్మరాజు చక్రపాణి ఈ నెట్‌వర్క్‌కు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దర్యాప్తులో మొత్తం 44 మంది అనుమానిత కొనుగోలుదారులను గుర్తించిన అధికారులు, 19 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 14 మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. సంబంధిత వ్యక్తులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!