

తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 3,427 దేవాలయాలకు రూ.15 కోట్ల 5 లక్షల 41 వేల 150 విడుదల చేసింది. జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 20, 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు, ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, ఆగస్టు 9న లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!