

దక్షిణ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా నది నుంచి సాగు, తాగునీటిని విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డిల బృందం కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పరిధిలో ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నందున నీటి అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నాలుగు పథకాల కింద ఉన్న పంటలను కాపాడేందుకు కృష్ణా నది నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని నెల రోజుల పాటు నిరంతరాయంగా విడుదల చేయాలని తెలంగాణ ప్రతినిధి బృందం కోరింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని నియంత్రిత పద్ధతిలో వినియోగించడంతో పాటు మిగిలిన రుతుపవన కాలంలో కురిసే వర్షాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా నీటి విడుదల చేపట్టాలని సూచించింది. జూరాల ఆయకట్టులో నీటి కొరత ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!