
క్రీడలు

డ్రగ్స్ కేసులో తెలంగాణ ఈగల్ పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు నెలరోజుల పాటు నిఘా పెట్టిన అనంతరం అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రధాన నిందితుడితో పాటు మొత్తం 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు.
నిందితుల నుంచి సుమారు ₹12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి థాయిలాండ్ నుంచి హైదరాబాద్కు సరఫరా అవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మరిన్ని లింకులను వెలికితీసేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!