
జనరల్

తమిళ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ సరసన “సంబరాల ఏటిగట్టు” చిత్రంలో నటిస్తోంది. ఇటీవల “ఘట్టా కుస్తీ 2”తో విజయాన్ని అందుకున్న ఆమె, తాజా ఇంటర్వ్యూలో తనకు కామెడీ సినిమాలు ఎంతో ఇష్టమని, అలాంటి పాత్రల్లో నటించాలని ఉందని వెల్లడించింది.
అయితే కామెడీ టైమింగ్‌లో ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఆమె అంగీకరించింది. సోషల్ మీడియా విషయానికి వస్తే, అది తనకు పూర్తిగా సురక్షితంగా అనిపించదని, ఒకసారి తన ఫొటోలు మార్ఫింగ్‌కు గురయ్యాయని తెలిపింది. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, తన పెంపుడు కుక్క పేరుతో ఉన్న అకౌంట్ ద్వారా మాత్రమే అభిమానులతో సినిమాల అప్డేట్స్ పంచుకుంటుందని చెప్పింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!