

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అస్సాంలో బొగ్గు, గనుల రంగ అభివృద్ధి, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల సమర్థ వినియోగం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో గనుల రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా అస్సాంలో బొగ్గు, గనుల రంగానికి సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, జి. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక వసతులు, అనుసంధానత, పర్యాటకం, సహజ వనరుల సమర్థ వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!