
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్‌ను సాయంత్రం 4 గంటలకు పరిశీలించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి రాత్రి కొడంగల్‌లోనే బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం తన పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!