

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ పేరుతో కొత్త రవాణా సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సేవల కోసం ఏర్పాటు చేసిన కొత్త వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, ప్రజలకు అవగాహన కల్పించే బ్రాండింగ్ నమూనాలను సీఎం క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలిపారు.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక ఎస్‌యూవీ/ఎంయూవీ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులు, వారి సహాయకులను ఉచితంగా ఇంటికి చేర్చడంతో పాటు, అధిక ప్రమాద గర్భిణులు మరియు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ఆసుపత్రులకు రాకపోకల కోసం ఈ సేవలు వినియోగించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది బాలింతలు లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!