
జనరల్

న్యూఢిల్లీలో పార్లమెంట్ సమీపంలో సీజేపీ కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్లమెంట్ ప్రధాన గేటు వద్దకు చేరుకుని బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!