
సినిమాలు

తిరుమలలో మరోసారి సోషల్ మీడియా రీల్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్న సమయంలో ఓ కుటుంబం సర్వదర్శనం క్యూలైన్, రాంబగీచా ప్రాంతాల్లో రీల్స్ చేసినట్లు సమాచారం. దేవుడి పేరుతో రూపొందించిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.
పుణ్యక్షేత్రంలో ఇలాంటి రీల్స్ చేయడం ఎంతవరకు సమంజసమంటూ పలువురు కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం పబ్లిసిటీ కోసం కొంతమంది కావాలనే ఆలయ పరిసరాల్లో రీల్స్ చేస్తూ వార్తల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. దీంతో తిరుమల వంటి పవిత్ర ప్రదేశాల్లో సోషల్ మీడియా కంటెంట్ చిత్రీకరణపై మరోసారి చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!