

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. IPL 2027కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడి మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశాలను అతడు పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2019 నుంచి సన్‌రైజర్స్‌తో కొనసాగుతున్న అభిషేక్‌కు కెప్టెన్సీపై ఆసక్తి ఉన్నట్లు సమాచారం. 2026 సీజన్ ఆరంభంలో పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్‌కు ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా.. అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో అతడి భవిష్యత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి.
అభిషేక్ శర్మతో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు అనధికారికంగా చర్చలు జరిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అతడి మెంటర్ యువరాజ్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ వ్యవస్థలో ఉండటంతో ఆ జట్టు పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ CEO కే. షణ్ముగం ఈ వార్తలను ఖండిస్తూ అవి నిజం కాదని తెలిపారు. IPL అధికారిక గణాంకాల ప్రకారం 2026 సీజన్‌లో అభిషేక్ 563 పరుగులు సాధించాడు. రిటెన్షన్, ట్రేడ్ ప్రక్రియ ముందుకు సాగుతున్న నేపథ్యంలో అతడు ఎస్‌ఆర్‌హెచ్‌లో కొనసాగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!