
జనరల్

సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌లో మృగశిర కార్తె సందర్భంగా సాంప్రదాయ చేప మందు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాదాపు 80 ఏళ్లుగా తడకంటి సోదరులు కొనసాగిస్తున్న ఈ సేవకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ స్పందన లభించింది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రోగులు నిజాంపేట్‌కు చేరుకున్నారు. దగ్గు, ఉబ్బసం, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సంప్రదాయ పద్ధతిలో చేప మందు అందజేశారు. మృగశిర కార్తె రోజున ప్రత్యేకంగా నిర్వహించే ఈ కార్యక్రమం ప్రాంతీయ సంప్రదాయంగా కొనసాగుతూ ప్రజల విశ్వాసాన్ని చాటుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!