2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

Writer: Shivani K 09:15 PM, 16 ఆగస్టు, 2026
మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

ఈరోజు 16న మధ్యాహ్నం 3 గంటలలోపు మౌలాలి రైల్వే ఎల్‌సీ గేట్‌ నంబర్‌ 6 సమీపంలోని అప్‌లైన్‌ వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. జనగాం నుంచి తల్లిదండ్రులతో కలిసి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో మౌలాలి చేరుకున్న 20 ఏళ్ల మానస.. ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 2 నుంచి 1వ ప్లాట్‌ఫామ్‌ వైపు వెళ్లే క్రమంలో పట్టాలు దాటేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆమెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానస పట్టాలు దాటడానికి కారణమేంటి, రైలు వస్తున్న విషయాన్ని గమనించిందా, ప్రమాదానికి ముందు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగుతోంది. వృత్తిరీత్యా నర్స్‌గా పనిచేస్తున్న మానస.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలందించే వృత్తిని ఎంచుకుంది. తల్లిదండ్రులతో కలిసి చేసిన సాధారణ రైలు ప్రయాణం విషాదాంతం కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
మౌలాలి రైల్వే ప్రమాదంవందేభారత్ ఎక్స్‌ప్రెస్యువ నర్స్ మృతిరైల్వే ప్రమాదంసికింద్రాబాద్ రైల్వే పోలీసులుజనగాంమౌలాలితెలంగాణ వార్తలురైలు ప్రమాదంబ్రేకింగ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..
టెక్నాలజీ

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..
జనరల్

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..
జనరల్

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..
క్రీడలు

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..
షోస్

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..
జనరల్

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...
రాజకీయాలు

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?
గాసిప్స్

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

కామెంట్స్ (1)

user
Venugopal Reddy Enugala17, ఆగ 2026

Very sad😢