

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. యాకుత్‌పురా నియోజకవర్గంలోని ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ నవీద్ ఉద్యోగరీత్యా దశాబ్దం క్రితం కుటుంబంతో కలిసి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లి, ఓ ఔషధ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహా నహీన్ షేక్ (19), కుమారుడు హఫీజ్ ఉమర్ షేక్ (14) అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షేక్ అబ్దుల్ నవీద్, చిన్న కుమార్తె ఖతీజా షేక్ (8) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద వార్తతో వాణీనగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన కుమారుడిని చూసేందుకు అమెరికా వెళ్లేందుకు తమకు అత్యవసర వీసాలు మంజూరు చేయాలని నవీద్ తండ్రి షేక్ అబ్దుల్ సయీద్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!