
జనరల్

విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో డేటా సెంటర్ల ఏర్పాటుతో పర్యావరణంపై పడే ప్రభావం, నీటి వినియోగం, కాలుష్యం, స్థానిక ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు గ్రీన్ విశాఖ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ నాగశైల, పరిశోధకులు, పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. వివిధ ప్రాంతాల ప్రజల సూచనలు, ప్రపంచ అనుభవాలు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘విశాఖపట్నం డిక్లరేషన్’ను ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరుకావాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!