

ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో ఉచిత అవుట్‌పేషెంట్ సేవలు కొనసాగనున్నాయి. కొత్త ఈహెచ్‌ఎస్ మార్గదర్శకాల ప్రకారం నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్ సేవలు, వెల్‌నెస్ సెంటర్లలో ఓపీ సేవలు అందించాల్సి ఉంది. అయితే ఈహెచ్‌ఎస్ లబ్ధిదారులకు నిమ్స్‌లో కూడా ఓపీ సేవలు యథావిధిగా ఉచితంగా అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు.
ప్రస్తుతం తెలంగాణలో 12 వెల్‌నెస్ సెంటర్లు పనిచేస్తుండగా, మరో 24 కేంద్రాలను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఇప్పటివరకు వెల్‌నెస్ సెంటర్లు లేని జిల్లా కేంద్రాల్లో కొత్త కేంద్రాల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో మరో మూడు వెల్‌నెస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ ఆసుపత్రులకు అనుసంధానంగా వెల్‌నెస్ సెంటర్లలో ప్రత్యేక వైద్య సేవలు, అత్యున్నత ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!