

మోసపూరిత, అనవసర కాల్స్‌ను అరికట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. 1601 సిరీస్ నంబర్ల నుంచి కేవలం సర్వీస్ సంబంధిత కాల్స్ మాత్రమే చేయాలని ఆదేశించింది. 1601 నంబర్లను ఉపయోగించి ప్రమోషనల్, మార్కెటింగ్ కాల్స్ చేసేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. వినియోగదారులు నిజమైన సర్వీస్ కాల్స్‌ను సులభంగా గుర్తించడంతో పాటు మోసపూరిత కాల్స్ నుంచి రక్షణ పొందేలా ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
1601 సిరీస్‌కు మారాల్సిన సంస్థలకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు TRAI పేర్కొంది. సర్వీస్ కాల్స్‌కు ప్రత్యేక నంబరింగ్ సిరీస్ ఉండటం వల్ల వినియోగదారులకు కాల్ స్వభావంపై మరింత స్పష్టత లభించనుంది. సాధారణ ఫోన్ నంబర్లను ఉపయోగించి ప్రమోషనల్ లేదా మోసపూరిత కాల్స్ చేసే అవకాశాలను తగ్గించడంతో పాటు టెలికాం రంగంలో పారదర్శకత, వినియోగదారుల భద్రతను పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!