

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. తాను గొప్పలు చెప్పుకోవడం లేదని, ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపేందుకు కృషి చేశానని పేర్కొన్నారు. ఇతర అధ్యక్షులు చేయలేని పనులను తాను చేశానని, తన సేవలను పరిగణనలోకి తీసుకుంటే నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినని ట్రంప్ అన్నారు. అయితే ఈ పురస్కారం తనకు వస్తుందనే నమ్మకం మాత్రం లేదని వ్యాఖ్యానించారు.
నోబెల్ శాంతి బహుమతిని ఏటా నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రదానం చేస్తుంది. 2026 సంవత్సరానికి సంబంధించిన శాంతి బహుమతిని అక్టోబర్ 9న ప్రకటించనున్నారు. గత ఏడాది కూడా ట్రంప్ ఈ పురస్కారంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు అవార్డు దక్కింది. ఈ ఏడాది నామినేషన్లలో ట్రంప్ పేరు ఉండొచ్చన్న ప్రచారం నేపథ్యంలో, నోబెల్ శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!