

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని అమెరికా ప్రారంభించలేదని, 1979 నుంచే ఇరాన్ అమెరికాపై పోరాటం చేస్తోందని ఆరోపించారు. అమెరికా ఇప్పటికే ఈ పోరాటంలో విజయం సాధించిందని పేర్కొన్న ఆయన, పాక్షిక విజయంతో సరిపెట్టుకోబోమని, సంపూర్ణ విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికా సైన్యం ధ్వంసం చేసిన వాటిని తిరిగి నిర్మించుకోవడానికి ఇరాన్‌కు సుమారు పాతికేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు.
వర్జీనియాలోని ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికలో నిర్వహించిన వెటరన్స్ డే కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న ట్రంప్, సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యను చాలా కాలం క్రితమే పరిష్కరించాల్సి ఉండేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్‌పై గట్టిగా స్పందించిందని, అమెరికా సైన్యం తీవ్రంగా పోరాడిందని పేర్కొన్నారు. యుద్ధంలో అమెరికా గెలిచిందని చెబుతూనే, పాక్షిక విజయంతో కాకుండా పూర్తి స్థాయి విజయంతోనే ముగించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!