
జనరల్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో ఇకపై మంగళవారం మినహా రెండు బ్యాచ్‌లలో, ఒక్కో బ్యాచ్‌లో 25 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించనుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి చిన్నారికి టీటీడీ ఉచితంగా ‘అక్షర గోవిందం’ కిట్ అందజేయనుంది. తల్లిదండ్రులు ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!