
సినిమాలు

ఇంగ్లీష్ ఛానెల్‌లో రష్యా యుద్ధ నౌక వ్యవహరించిన తీరుపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రాదేశిక జలాల సమీపంలో బ్రిటన్ జెండా ఉన్న పౌర పడవ దిశ మార్చుకునేలా రష్యా యుద్ధ నౌక హెచ్చరిక సంకేతాలు ఇచ్చి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనను బ్రిటన్ ప్రధాని నిర్లక్ష్యపూరితమైనదిగా అభివర్ణించారు.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, బ్రిటిష్ యాచ్ యుద్ధనౌకకు చాలా దగ్గరగా రావడంతో రేడియో ద్వారా పలుమార్లు సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందన రాలేదని తెలిపింది. దీంతో హెచ్చరికలు జారీ చేసి చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు పేర్కొంది. అయితే యాచ్‌లో ఉన్న బ్రిటిష్ దంపతులు ఈ ఆరోపణలను ఖండిస్తూ, తాము ప్రమాదకరంగా దగ్గరగా లేమని చెప్పారు. ఈ ఘటనపై బ్రిటన్ రక్షణ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!