

రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సరికొత్త సాంకేతికతను వినియోగిస్తోంది. ఉత్తర డొనెట్స్క్ ప్రాంతంలో చేపట్టిన ‘ఆపరేషన్ వివాల్డీ’లో సోవియట్ కాలం నాటి BTR-60 సాయుధ వాహనాలను మానవరహిత ‘కామికేజ్’ గ్రౌండ్ వెహికల్స్‌గా మార్చి రష్యా రక్షణ స్థావరాలపై ఉపయోగించినట్లు ఉక్రెయిన్ థర్డ్ ఆర్మీ కోర్ తెలిపింది. ఈ రోబోటిక్ వాహనాలతో బలమైన రక్షణ వ్యవస్థలను ఛేదించిన అనంతరం ఉక్రెయిన్ దళాలు ముందుకు సాగినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో 250 మందికిపైగా రష్యా సైనికులను బంధించినట్లు వెల్లడించింది.
కటెరినివ్కా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామని, కార్పివ్కా, నోవోమిఖాయిలివ్కాపై మళ్లీ నియంత్రణ సాధించామని ఉక్రెయిన్ ప్రకటించింది. తాజా దశలో మరో 51 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని, దీంతో ఆపరేషన్ వివాల్డీలో మొత్తం 176 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ ఆధీనంలోకి వచ్చిందని తెలిపింది. తాజా దశలో సుమారు 2,000 మంది రష్యా సైనికులు నష్టపోయారని ఉక్రెయిన్ చేసిన వాదనను స్వతంత్రంగా ధ్రువీకరించడం సాధ్యం కాలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!