

ప్రపంచ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయింది. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు కారణం ఇరాన్ దాడా, లేక సాంకేతిక లోపమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరిస్తూ పైలట్లు క్షేమంగా ఉన్నారని తెలిపారు. హోర్ముజ్ ప్రాంతంలో భద్రతా చర్యల కోసం అమెరికా అపాచీ హెలికాప్టర్లు, రీపర్ డ్రోన్లు, ఎఫ్/ఏ-18 మరియు ఎఫ్-35 యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లలో ఒకటైన అపాచీ, హెల్‌ఫైర్ క్షిపణులు మరియు శక్తివంతమైన రక్షణ వ్యవస్థలతో శత్రు లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!