
జనరల్

వందే మాతరానికి ఇప్పుడు భారత జాతీయ గీతం జనగణమనతో సమానమైన చట్టబద్ధ రక్షణ లభించింది. Prevention of Insults to National Honour (Amendment) Act, 2026కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో 1971 నాటి జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం పరిధిలోకి జాతీయ గీతంతో పాటు జాతీయ గేయం వందే మాతరం కూడా వచ్చింది. దాని ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం శిక్షార్హమైన నేరంగా మారింది.
పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. తాజాగా ఆమోదం లభించడంతో వందే మాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే లేదా అంతరాయం కలిగించే చర్యలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. దీంతో వందే మాతరం, జనగణమన రెండింటికీ అవమానం లేదా ఉద్దేశపూర్వక అంతరాయం విషయంలో ఒకే చట్టపరమైన రక్షణ అమల్లోకి వచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!