
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులు, వైద్య శిక్షణలో ఉన్న వారికి ప్రభుత్వం స్టైపెండ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. MBBS, BDS హౌస్ సర్జన్లకు ప్రస్తుతం అందుతున్న స్టైపెండ్‌పై 10 శాతం పెంపు వర్తించనుంది. అలాగే ఇంటర్న్స్, పీజీ, సూపర్ స్పెషాలిటీ, MDS, DNB విద్యార్థులకు పెంచిన స్టైపెండ్ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
పీజీ డిగ్రీ, డిప్లొమో విద్యార్థులకు 5 శాతం స్టైపెండ్ పెంపు కల్పించనున్నారు. అంతేకాకుండా 2027 జనవరి 1 నుంచి ఏటా 3.5 శాతం చొప్పున స్టైపెండ్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల వైద్య విద్యార్థులు, శిక్షణలో ఉన్న వైద్యులకు ఈ నిర్ణయం ద్వారా అదనపు ఆర్థిక ప్రయోజనం అందనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!