17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

Writer: Chandrika 09:18 AM, 17 సెప్టెంబర్, 2026
విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

విజయవాడ రైల్వే డివిజన్‌లో అరుదైన ‘రైల్‌ ఓవర్‌ రైల్‌ (ROR)’ బైపాస్‌ రూపుదిద్దుకుంటోంది. ఒక రైల్వే లైన్‌ను మరో లైన్‌ దాటే ప్రాంతంలో సాధారణ లెవల్‌ క్రాసింగ్‌కు బదులుగా.. ఒక మార్గాన్ని మరో మార్గం పైనుంచి తీసుకెళ్లేలా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. రాయనపాడు–ముస్తాబాద మధ్య 22 కి.మీ మేర ఈ బైపాస్‌ మార్గాన్ని సుమారు రూ.500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఏడాది క్రితం ప్రారంభమైన పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులు అనుకున్న విధంగా పూర్తయితే ఈ ఏడాది చివరి నాటికి మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్‌లో సరకు రైళ్ల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించడమే ఈ బైపాస్‌ ప్రధాన లక్ష్యం. ఖాజీపేట, సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే గూడ్స్‌ రైళ్లను విజయవాడ స్టేషన్‌లోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించనున్నారు. దీంతో సరకు రవాణా మరింత సులభతరం కానుంది.

మొత్తం 22 కి.మీ మార్గాన్ని మూడు విభాగాలుగా చేపట్టారు. రాయనపాడు–విజయవాడ నార్త్‌, ఈస్ట్‌ క్యాబిన్‌ల మధ్య 10 కి.మీ మార్గం ఒక విభాగంగా ఉంది. విజయవాడ నార్త్‌, ఈస్ట్‌ క్యాబిన్‌–గుణదల మధ్య 6 కి.మీ మార్గం 2023లోనే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది బైపాస్‌లో కీలక భాగంగా పనిచేస్తోంది. గుణదల–ముస్తాబాద మధ్య మరో 6 కి.మీ మార్గం నిర్మాణంలో ఉంది. ఈ మూడు విభాగాలు పూర్తిస్థాయిలో అనుసంధానమైతే రాయనపాడు నుంచి ముస్తాబాద వరకు ప్రత్యామ్నాయ రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. బైపాస్‌ పూర్తయితే రాయనపాడు, గుణదల స్టేషన్లను శాటిలైట్‌ స్టేషన్లుగా మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు సరకు రవాణా సామర్థ్యం, డివిజన్‌ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

ట్యాగ్లు
విజయవాడ రైల్వే డివిజన్విజయవాడ రైల్వేరైల్ ఓవర్ రైల్ఆర్‌వోఆర్ బైపాస్రైల్వే బైపాస్గూడ్స్ రైళ్లుసరకు రవాణారాయనపాడుముస్తాబాదగుణదలరైల్వే ప్రాజెక్టులుభారతీయ రైల్వేలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?
గాసిప్స్

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌
జనరల్

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత
సినిమాలు

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..
జనరల్

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..
జనరల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు
జనరల్

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి
జనరల్

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!