
సినిమాలు

విజయవాడలో సాయికృష్ణ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కోర్టుకు ముఖ్యమైన వివరాలను సమర్పించింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం కీలక సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమైనట్లు వెల్లడైంది. అదేవిధంగా, పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మరకలు గుర్తించినట్లు సిట్ తెలిపింది.
దర్యాప్తులో భాగంగా లాఠీ, ఎముకలు, బూడిద, కాలిన హ్యాండ్‌కఫ్ వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సాక్షుల వాంగ్మూలాల ప్రకారం సాయికృష్ణ కస్టడీలో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు సమాచారం. మృతదేహం ఆచూకీ కనుగొనడానికి సీఐ నాగరాజు కస్టడీ అవసరమని సిట్ కోర్టులో వాదించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!