

తమిళనాడు సీఎం, నటుడు విజయ్ యూకే పర్యటనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆరు రోజుల పర్యటనలో మొత్తం రూ.15,300 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు, వీటి ద్వారా 10,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారిక ప్రకటన పేర్కొంది. ఆటో విడిభాగాలు, తయారీ, ఇంజినీరింగ్, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు సంబంధించిన పలు ఒప్పందాలు, పెట్టుబడి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.
యూకే పర్యటనలో విజయ్ వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులు, అధికారులతో సమావేశమై తమిళనాడులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. సమ్వర్ధనా మదర్సన్ ఇంటర్నేషనల్ సంస్థ రూ.11,000 కోట్ల పెట్టుబడితో పలు సదుపాయాలను ఏర్పాటు చేయనుండగా, ఇతర సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పెట్టుబడి ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని విజయ్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!