
జనరల్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన కేటీఆర్ ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘సత్యమేవ జయతే’ అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరి, సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ధర్మాసనం దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!