
జనరల్

కెనడాలో నివసిస్తున్న భారత పౌరులకు అక్కడి అధికారులు కీలక హెచ్చరిక జారీ చేశారు. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం (పీఆర్), ఉద్యోగ అవకాశాల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇమిగ్రేషన్ శాఖ లేదా కాన్సులేట్ అధికారుల పేరుతో మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవల ఇలాంటి మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు కోరే కాల్స్‌పై ప్రత్యేక జాగ్రత్త వహించాలని అధికారులు పేర్కొన్నారు. అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారం ధృవీకరించుకోవాలని, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకుండా ఉండాలని భారతీయులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!