

అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు పాక్ బౌలర్లు ఆరంభం నుంచే గట్టి పోటీనిచ్చారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో వికెట్లు వరుసగా పడుతున్నా అర్జున్ రాజ్‌పుత్ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా అద్భుతంగా ఆడాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 107 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో భారత్ 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది.
ఆర్యవీర్ సెహ్వాగ్ 22, కావ్య పటేల్ 23 పరుగులతో రాణించగా.. అన్వయ్ ద్రవిడ్ 10, మనల్ చౌహాన్ 11 పరుగులు చేశారు. కెప్టెన్ లక్ష్య రాజేశ్ రాయ్ చందాని డకౌట్ కాగా, యశ్‌బర్దాన్ చౌహాన్ ఒక పరుగు, యశ్వీర్ గౌడ్ నాలుగు, వీకే వినీత్ ఎనిమిది, మోహిత్ ఉల్వా ఏడు పరుగులకే పరిమితమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్ షాఫిక్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సయ్యమ్ ఒక వికెట్ తీశాడు. దీంతో పాక్ విజయానికి 209 పరుగులు చేయాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!