
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఈ విడతలో నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17 చివరి తేదీ కాగా, 26న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 16న వెలువడనుంది. ఈ విడత నామినేషన్లకు 20 చివరి గడువు కాగా, 29న పోలింగ్ జరగనుంది.
మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈ విడత నామినేషన్ల దాఖలుకు 23 చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. మూడు విడతల్లో కలిపి రాష్ట్రంలోని 13,354 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!