
రాజకీయాలు

విశాఖపట్నం వేదికగా నేడు, రేపు 31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ జరగనుంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఈ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సదస్సు భద్రత కోసం 2,700 మంది సిబ్బందిని నియమించారు.
ఈ సమ్మిట్‌కు 59 దేశాల నుంచి 15 మంది మంత్రులు, సుమారు 1,250 మంది పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ముగింపు ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు. విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకురావడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. వాహనాల రాకపోకలు, పార్కింగ్ నిర్వహణ కోసం 12 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!